Imran Khan: నా హత్యకు కుట్ర: ఇమ్రాన్‌ ఆరోపణ

పాకిస్థాన్‌ లేదా విదేశాల్లో తనను హత్యచేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. తనకు ఏం జరిగినా.. అందుకు కారకులెవరన్నది ప్రజలు గుర్తించగలరన్నారు. పాకిస్థాన్‌ను దొంగల చేతికి

Updated : 15 May 2022 08:15 IST

దేశం మీద అణు బాంబు వేయండి

దొంగలకు అధికారం ఇవ్వడం కంటే అదే నయం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ లేదా విదేశాల్లో తనను హత్యచేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. తనకు ఏం జరిగినా.. అందుకు కారకులెవరన్నది ప్రజలు గుర్తించగలరన్నారు. పాకిస్థాన్‌ను దొంగల చేతికి అప్పగించడం కంటే దేశం మీద ఒక అణు బాంబు వేసేయడమే నయమని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. దొంగలను దేశంలోకి చొప్పించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. పాత పాలకుల అవినీతి గురించి కథలు చెప్పడానికి బదులు తమ సొంత ప్రభుత్వ పనితీరుపై దృష్టిపెట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన ఈ దొంగలు న్యాయవ్యవస్థ సహా అన్ని సంస్థలనూ నాశనం చేశారని, వీరి మీద కేసులను ఏ ప్రభుత్వాధికారి విచారిస్తారని ఇమ్రాన్‌ ప్రశ్నించారు. ఈ నెల 20న నిర్వహించే ప్రదర్శనలో భాగంగా రాజధానిలోకి ప్రవేశించకుండా తనను ఎవరూ నిలువరించలేరని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ ప్రదర్శనలో 20 లక్షల మంది పాల్గొంటారని, వారిని అడ్డుకోడానికి ఎన్ని కంటెయినర్లు పెట్టినా ఆగేది లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని