రోబోటిక్‌ సర్జరీతో సత్వర స్వస్థత

ఓపెన్‌ సర్జరీలతో పోలిస్తే- రోబోటిక్‌ సర్జరీల వల్ల బాధితులు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం సగానికిపైగా, రక్తం గడ్డకట్టే ముప్పు 77% మేర తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌ పరిశోధకులు

Published : 17 May 2022 05:10 IST

తాజా పరిశోధనలో వెల్లడి

లండన్‌: ఓపెన్‌ సర్జరీలతో పోలిస్తే- రోబోటిక్‌ సర్జరీల వల్ల బాధితులు ఆసుపత్రిలో ఉండాల్సిన సమయం సగానికిపైగా, రక్తం గడ్డకట్టే ముప్పు 77% మేర తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ షెఫీల్డ్‌ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. పరిశోధనలో భాగంగా బ్రిటన్‌లోని 9 ఆసుపత్రుల్లో చేరిన 338 మంది బాధితుల్లో 169 మందికి రోబోటిక్స్‌ ద్వారా మూత్రాశయ తొలగింపు శస్త్రచికిత్స చేశారు. మరో 196 మందికి ఓపెన్‌ రాడికల్‌ సిస్టెక్టమీ చేశారు. ఆ తర్వాత వారి రికవరీ, ఆసుపత్రుల్లో ఉన్న సమయం, జీవన నాణ్యత వంటి అంశాలను నిశితంగా విశ్లేషించారు. ఈ సర్జరీ తర్వాత రోగుల సత్తువ, జీవన నాణ్యత త్వరగా మెరుగుపడుతున్నాయని, పడకపై రోజుల తరబడి ఉండాల్సిన అవసరం కూడా లేదని వారు నిర్ధారించారు. రోబోటిక్‌ ఆధార సర్జరీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నందున బ్రిటన్‌ వ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఎక్సలెన్స్‌ (నైస్‌)కు పరిశోధకులు సిఫారసు చేశారు. ముఖ్యంగా కొలొరెక్టర్, గ్యాస్ట్రో-ఇంటెస్టినల్, గైనకాలజీ వంటి ఉదర సంబంధ మేజర్‌ ఆపరేషన్లను ఈ విధానంలో చేపట్టాలని తాము సూచించినట్టు పరిశోధనకర్త జేమ్స్‌ కాటో తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని