త్వరలో తగ్గనున్న పామాయిల్‌ ధరలు!

ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు త్వరలోనే కాస్త దిగువకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశం నుంచి పామాయిల్‌ ఎగుమతిపై నెల రోజులుగా అమల్లో ఉన్న

Published : 20 May 2022 06:57 IST

 వంటనూనె ఎగుమతిపై నిషేధం  

 ఎత్తివేతకు ఇండోనేసియా నిర్ణయం 

జకార్తా: ప్రపంచవ్యాప్తంగా చుక్కలనంటుతున్న వంటనూనెల ధరలు త్వరలోనే కాస్త దిగువకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ దేశం నుంచి పామాయిల్‌ ఎగుమతిపై నెల రోజులుగా అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇండోనేసియా తాజాగా నిర్ణయించడమే ఇందుకు కారణం. ఈ నెల 23 నుంచి తమ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడొడొ వెల్లడించారు. ప్రపంచంలో 85% పామాయిల్‌ ఇండోనేసియా, మలేసియాల్లోనే ఉత్పత్తవుతుంటుంది. దేశీయంగా కొరతను నివారించడంతో పాటు ధరలకు కళ్లెం వేసేందుకుగాను వంటనూనెల ఎగుమతిపై ఇండోనేసియా నిషేధం విధించడంతో.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పామాయిల్‌ రేట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగిన సంగతి గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు