Temperature: తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల ముప్పు భారత్‌కు 100 రెట్లు ఎక్కువ!

వాతావరణ మార్పులు భారతావనికి పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పుల కారణంగా దేశంలో తీవ్రస్థాయి

Updated : 20 May 2022 08:18 IST

లండన్‌: వాతావరణ మార్పులు భారతావనికి పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని తాజా అధ్యయనమొకటి హెచ్చరించింది. పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పుల కారణంగా దేశంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల ముప్పు 100 రెట్లు పెరిగిందని తెలిపింది. పొరుగు దేశం పాకిస్థాన్‌లోనూ ఇదే తరహా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన ‘యూకే మెట్‌ ఆఫీస్‌’ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల వివరాలను 1900 సంవత్సరం నుంచి పక్కాగా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు 2010 ఏప్రిల్‌-మే నెలల్లో నమోదయ్యాయి. ఆ స్థాయి రికార్డు ఎండలు సగటున 312 ఏళ్లకు ఒకసారి మాత్రమే నమోదవుతాయని గతంలో శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే- పర్యావరణంలో వేగంగా వస్తున్న ప్రతికూల మార్పుల కారణంగా ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ వంటి దేశాల్లో ప్రతి 3.1 ఏళ్లకు ఒకసారి అంతకుముందున్న రికార్డుతో పోలిస్తే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు నెలకొందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ శతాబ్దం ముగిసే నాటికి ఆ సగటు 1.15 ఏళ్లకు తగ్గే అవకాశాలున్నాయనీ వెల్లడించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని