ఉక్రెయిన్‌ సంక్షోభంపైనే అందరి దృష్టి

దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు అది కొనసాగనుంది. పలు దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార,

Published : 23 May 2022 04:46 IST

దావోస్‌లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

దావోస్‌: దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు అది కొనసాగనుంది. పలు దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార, శాస్త్ర సాంకేతికత, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, పర్యావరణ మార్పులు సహా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఈ దఫా దావోస్‌లో చర్చ జరిగే అవకాశాలున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, వ్యాపార వ్యూహాలు వంటివి ఇందులో ఉండనున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయెన్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ తదితర అంతర్జాతీయ ప్రముఖులు సదస్సులో ప్రసంగించనున్నారు. సమావేశాల కోసం దావోస్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులకు తోడు 5 వేల మంది అదనపు బలగాలను మోహరించారు. ‘కీలక మలుపులో చరిత్ర’ అనే అంశాన్ని ఈ దఫా డబ్ల్యూఈఎఫ్‌ సదస్సుకు ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మొత్తంగా దాదాపు 2,500 మంది నాయకులు, వివిధ రంగాల నిపుణులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని