Updated : 24 May 2022 04:54 IST

రష్యాతో లావాదేవీలు ఆపేయండి

దావోస్‌ సదస్సులో జెలెన్‌స్కీ పిలుపు

దావోస్‌: రష్యాపై గరిష్ఠ స్థాయిలో ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ.. ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సును ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో మాట్లాడారు. రష్యాతో అన్ని రకాల వాణిజ్య లావాదేవీలను నిలిపివేయాలని, ఆ దేశానికి చెందిన బ్యాంకులను కూడా నిషేధించాలని కోరారు. రష్యాను వీడి ఉక్రెయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యా వల్ల మరో యుద్ధం సంభవించకుండా ప్రపంచం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. రష్యాపై ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్‌కు చెందిన ఐదుగురు మహిళా ఎంపీలు కోరారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని