Corona Virus: గుండెను దెబ్బతీస్తున్న కరోనా.. కుడివైపు పనితీరుపై తీవ్ర ప్రభావం

కొవిడ్‌తో గుండె పనితీరు దెబ్బతింటోందని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్కాట్లాండ్‌లో చేసిన తాజా పరిశోధనల్లో తేలింది. ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో,

Updated : 25 May 2022 07:15 IST

లండన్‌: కొవిడ్‌తో గుండె పనితీరు దెబ్బతింటోందని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై తీవ్ర ప్రభావం పడుతోందని స్కాట్లాండ్‌లో చేసిన తాజా పరిశోధనల్లో తేలింది. ఈ అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో, ఎన్‌హెచ్‌ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ శాస్త్రవేత్తలు స్కాట్లాండ్‌లో ఉన్న 10 ఐసీయూలలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై పరిశోధనలు చేసి, ఆ ఫలితాలు వెల్లడించారు. పరిశీలించిన ప్రతి ముగ్గురికి ఒకరిలో గుండె కుడివైపు దెబ్బతింటోంది. దీనివల్ల మరణం కూడా సంభవించొచ్చని ఎన్‌హెచ్‌ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీలో కార్డియోథొరాసిక్‌ ఎనస్థీషియా, ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగానికి చెందిన ఫిలిప్‌ మెక్‌కాల్‌ తెలిపారు. కొవిడ్‌ వల్ల ఊపిరితిత్తులు బాగా బలహీనపడి, అవి రక్తాన్ని స్వీకరించే పరిస్థితిలో ఉండవని, అయినా రక్తం సరఫరా చేసేందుకు గుండె ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. గుండె మీద కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని, ఏం జరుగుతోందో తెలిసింది కాబట్టి మెరుగైన చికిత్స అందించి సమస్యను అధిగమించే అవకాశం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎన్‌హెచ్‌ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ ఆస్పత్రి ఎనస్థీషియా, ఇంటెన్సివ్‌ కేర్‌ నిపుణుడు బెన్‌ షెల్లీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని