Boris Johnson: తప్పైపోయింది.. క్షమించండి: బోరిస్‌ జాన్సన్‌

కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి.. తాను, తన ప్రభుత్వంలోని నేతలు, అధికారులు పాల్గొన్న మద్యం విందులపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బుధవారం పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పారు. ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్‌ తన

Published : 26 May 2022 09:16 IST

లండన్‌: కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించి.. తాను, తన ప్రభుత్వంలోని నేతలు, అధికారులు పాల్గొన్న మద్యం విందులపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ బుధవారం పార్లమెంట్‌లో క్షమాపణ చెప్పారు. ‘పార్టీగేట్‌’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్‌ తన తుది నివేదికను సమర్పించింది. ఇందులో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మద్యం విందులకు సీనియర్‌ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జాన్సన్‌.. నివేదికలోని అంశాలను పార్లమెంట్‌లో అంగీకరించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి, ముందుకు కదులుదామని, ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని