యుద్ధవిమానాలతో జపాన్‌, అమెరికా సంయుక్త విన్యాసాలు

జపాన్‌ సముద్రంపై అమెరికా, జపాన్‌ బలగాలు యుద్ధవిమానాలతో బుధవారం సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్‌-16, జపాన్‌కు చెందిన 4 ఎఫ్‌-15 యుద్ధవిమానాలు

Published : 27 May 2022 05:16 IST

టోక్యో: జపాన్‌ సముద్రంపై అమెరికా, జపాన్‌ బలగాలు యుద్ధవిమానాలతో బుధవారం సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్‌-16, జపాన్‌కు చెందిన 4 ఎఫ్‌-15 యుద్ధవిమానాలు ఇందులో పాల్గొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం టోక్యోలో ఉన్నప్పుడు రష్యా, చైనా సంయుక్త యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. దానికి స్పందనగా తమ ఉమ్మడి సామర్థ్యాలను ప్రదర్శించేందుకుగాను అమెరికా, జపాన్‌ తాజా విన్యాసాలు నిర్వహించి ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉత్తర కొరియా మూడు క్షిపణి పరీక్షలు నిర్వహించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడమూ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతరిక్ష రంగంలో సహకారానికి బ్రిక్స్‌ సంయుక్త కమిటీ
రోదసి రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకుగాను బ్రిక్స్‌ దేశాలు (బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) ఓ సంయుక్త కమిటీని ప్రారంభించాయి. సభ్యదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు సన్నిహితంగా పనిచేసేందుకు ఇది వీలు కల్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని