
విచిత్ర ఘటన: భార్యతో శృంగారం.. పది నిమిషాలకే మతిమరుపు
లిమ్రిక్(ఐర్లాండ్): భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపునకు గురయ్యాడొక వ్యక్తి. ఐర్లాండ్‌లో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనను ‘ఐరిష్ జర్నల్’ ప్రచురించింది. ఈ జర్నల్ కథనం ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్ వ్యక్తి... తన భార్యతో శృంగారం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్లో తేదీని చూసుకొని, ముందు రోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ... ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెబితే వారు మరింత షాక్‌కు లోనయ్యారు. కారణం... ముందు రోజు సాయంత్రం ఇంట్లో పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగడమే. ఆ సంఘటనను భర్త ఎలా మరిచిపోయారో భార్యకు అర్థం కాలేదు. దీంతో ముందు రోజు సాయంత్రం జరిగిన వేడుకలను పదే పదే జ్ఞప్తికి తెచ్చేందుకు భార్యాపిల్లలు ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే తన పేరు, వయసు, పాత విషయాలను మాత్రం ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవడం విశేషం. దీన్ని వైద్యులు స్వల్పకాలిక మతిమరుపుగా పేర్కొన్నారు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా (టీజీఏ) అంటారని తెలిపారు. ఇది 50 నుంచి 70 ఏళ్ల మధ్య వారిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. 2015లో కూడా ఈ వ్యక్తి టీజీఏ ప్రభావానికి లోనయ్యారు. ఆ సమయంలోనూ భార్యతో శృంగారం చేసిన తర్వాతే కావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
India News
Kerala: సీఎం పినరయ్ విజయన్ను తుపాకీతో కాలుస్తా: మాజీ ఎమ్మెల్యే భార్య హెచ్చరిక
-
Crime News
దారుణం.. మైనర్లయిన అక్కాచెల్లెలిపై గ్యాంగ్ రేప్: ఐదుగురు యువకులు అరెస్టు!
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
Movies News
Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- IND vs ENG: పుజారా అర్ధశతకం.. మూడో రోజు ముగిసిన ఆట
- Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
- Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
- బిగించారు..ముగిస్తారా..?
- Rishabh Pant: వికెట్ కీపర్లలో పంత్.. బ్రియాన్ లారా: పాక్ మాజీ కెప్టెన్
- ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- Narendra Modi: డబుల్ ఇంజిన్ వస్తోంది
- Ante Sundaraniki: డేట్ సేవ్ చేసుకోండి.. ‘అంటే.. సుందరానికీ!’.. ఆరోజే ఓటీటీలోకి