Corona Virus: సంతాన సాఫల్య సాధనంతో కొవిడ్ గుర్తింపు
స్త్రీల రుతు క్రమంలో గర్భధారణకు అనువైన అయిదు రోజులను వెల్లడించే ఏవా అనే సాధనం.. కొవిడ్-19 లక్షణాలను ముందే పసిగట్టి హెచ్చరించగలదని పరిశోధకులు కనిపెట్టారు. వారి అధ్యయనం బీఎంజే పత్రికలో ప్రచురితమైంది. నిద్రకు ఉపక్రమించే
లండన్: స్త్రీల రుతు క్రమంలో గర్భధారణకు అనువైన అయిదు రోజులను వెల్లడించే ఏవా అనే సాధనం.. కొవిడ్-19 లక్షణాలను ముందే పసిగట్టి హెచ్చరించగలదని పరిశోధకులు కనిపెట్టారు. వారి అధ్యయనం బీఎంజే పత్రికలో ప్రచురితమైంది. నిద్రకు ఉపక్రమించే ముందు చేతి మణికట్టుకు అమర్చుకునే సాధనమే ఏవా. అది శ్వాస రేటును, గుండె కొట్టుకునే రేటు, అందులోని తేడాలు, మణికట్టు మీది చర్మ ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ వేగం, నిద్రించే సమయాలను గమనిస్తుంది. ఏవాను మణికట్టుకు ధరించిన వ్యక్తి కనీసం నాలుగు గంటల సేపు గాఢనిద్ర పోవాలి. ఆ సమయంలో ప్రతి 10 సెకన్లకు ఒకసారి పై సమాచారాన్ని (డేటా) సేకరించి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషిస్తే కొవిడ్ రాకను ముందే గుర్తించవచ్చని పరిశోధకులు కనిపెట్టారు. ఏవా డేటాను స్మార్ట్ ఫోన్ యాప్‌లో విశ్లేషిస్తారు. 2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ వరకు 51 ఏళ్ల లోపు వయోవర్గంలోని 1,163 మందిపై ఏవా సాధనాన్ని ప్రయోగించి చూశారు. వారు రాత్రిపూట ఈ సాధనాన్ని ధరించి నిద్రించడంతోపాటు కొవిడ్ కారక సార్స్ కోవ్ 2 వైరస్ ఉనికిని పసిగట్టే యాంటీబాడీ పరీక్షలను కూడా చేయించుకున్నారు. వారిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే పీసీఆర్ పరీక్షలూ చేయించుకున్నారు. అధ్యయన కాలంలో 127 మందికి కొవిడ్ సోకింది. వారిలో 66 మంది వరుసగా 29 రోజులపాటు ఏవా సాధనాన్ని మణికట్టుకు ధరించారు. వారిలో ఎనిమిదిన్నర రోజులపాటు కొవిడ్ లక్షణాలు ముందే పొడసూపాయి. వేరబుల్ సాధనాలను ఏఐ అల్గొరిథమ్తో కలిపి ఉపయోగిస్తే వ్యాధి రాకడను ముందే పసిగట్టవచ్చని నిర్ధారణ అయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM