ఒంటికాలిపై 10 సెకన్లు కూడా నిలబడలేకపోతున్నారా?

మీరు మధ్య వయస్కులా? అయితే- ఏ సహాయమూ తీసుకోకుండా ఒంటికాలి మీద 10 సెకన్ల పాటు సరిగా నిలబడగలుగుతున్నారో లేదో చూసుకోండి. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? బ్రెజిల్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాలకు చెందిన పలువురు పరిశోధకులు తాము

Updated : 24 Jun 2022 07:40 IST

బ్రసీలియా: మీరు మధ్య వయస్కులా? అయితే- ఏ సహాయమూ తీసుకోకుండా ఒంటికాలి మీద 10 సెకన్ల పాటు సరిగా నిలబడగలుగుతున్నారో లేదో చూసుకోండి. ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? బ్రెజిల్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, అమెరికాలకు చెందిన పలువురు పరిశోధకులు తాము సంయుక్తంగా చేపట్టిన ఓ అధ్యయనంలో కీలక అంశాన్ని గుర్తించారు. ఏ సహాయమూ లేకుండా ఒంటికాలి మీద 10 సెకన్ల పాటు నిలబడలేకపోతున్నవారిలో మృత్యు ముప్పు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలిందని వారు తెలిపారు. బ్రెజిల్‌లో 50 ఏళ్లకు పైగా వయసున్న 1,702 మందికి ఈ పరీక్ష పెట్టగా.. అందులో విఫలమైనవారిలో 17.5% మంది పదేళ్ల కాల వ్యవధిలోనే వివిధ అనారోగ్య కారణాలతో కన్నుమూశారని పేర్కొన్నారు. తమ పరీక్ష పాసైనవారిలో మాత్రం కేవలం 4.5% మంది పదేళ్ల లోపు మరణించారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని