Covid In Children: పిల్లల్లో 2 నెలలపాటు దీర్ఘకాలిక కొవిడ్
చిన్నారుల్లో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు కనీసం రెండు నెలల పాటు కనిపించే అవకాశముందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి వారిని ఎక్కువగా వేధిస్తున్నట్లు నిర్ధరించింది. డెన్మార్క్‌లో 2020 జనవరి నుంచి
లండన్: చిన్నారుల్లో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలు కనీసం రెండు నెలల పాటు కనిపించే అవకాశముందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. అలసట, దద్దుర్లు, కడుపు నొప్పి వంటివి వారిని ఎక్కువగా వేధిస్తున్నట్లు నిర్ధరించింది. డెన్మార్క్‌లో 2020 జనవరి నుంచి 2021 జులై మధ్య కరోనా మహమ్మారి బారిన పడిన 11 వేల మంది పిల్లల ఆరోగ్య పరిస్థితిని.. ఎన్నడూ కొవిడ్ సోకని 33 వేల మంది చిన్నారులతో పోల్చిచూడటం ద్వారా కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయం ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఆ పిల్లలందరూ 14 ఏళ్లలోపువారే. దీర్ఘకాలిక కొవిడ్ నిర్వచనంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్న 23 అనారోగ్య లక్షణాలు వారిలో ఎంతమేరకు ఉన్నాయో పరిశీలించారు. 0-3 ఏళ్ల వయసువారిలో 40% మంది, 4-11 ఏళ్ల వారిలో 38% మంది, 12-14 ఏళ్లవారిలో 41% మంది దీర్ఘకాలిక కొవిడ్‌తో ఇబ్బంది పడినట్లు నిర్ధరించారు. వారిలో కనీసం ఏదైనా ఒక అనారోగ్య లక్షణం రెండు నెలల పాటు కొనసాగినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు