బ్రిటిష్‌ ప్రధానికి కొత్త చిక్కు!

ఇటీవల రెండు పార్లమెంటు ఉపఎన్నికల్లో పాలక కన్సర్వేటివ్‌ పార్టీ ఓడిపోవడంతో గడ్డుస్థితిని ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు... తాజాగా సొంత పార్టీ నుంచే సవాలు ఎదురవుతోంది! జాన్సన్‌ విధేయుడు, పార్టీ సహాధ్యక్షుడు

Updated : 26 Jun 2022 09:26 IST

సొంత పార్టీ నేతల నుంచే సవాలు

లండన్‌: ఇటీవల రెండు పార్లమెంటు ఉపఎన్నికల్లో పాలక కన్సర్వేటివ్‌ పార్టీ ఓడిపోవడంతో గడ్డుస్థితిని ఎదుర్కొంటున్న బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌కు... తాజాగా సొంత పార్టీ నుంచే సవాలు ఎదురవుతోంది! జాన్సన్‌ విధేయుడు, పార్టీ సహాధ్యక్షుడు అయిన ఆలివర్‌ డౌడెన్‌ పార్టీ పదవికి రాజీనామా చేయడం ప్రధానమంత్రిని దుర్బల స్థితిలోకి నెట్టింది. ఇది చాలదన్నట్లు పార్టీ నాయకత్వం కోసం ఎన్నికలు నిర్వహించే కమిటీకి తాము పోటీ చేయాలని యోచిస్తున్నట్లు జాన్సన్‌ను వ్యతిరేకించే ఇద్దరు కన్సర్వేటివ్‌ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం కామన్వెల్త్‌ శిఖరాగ్ర సమావేశం కోసం రువాండాలో ఉన్న జాన్సన్‌- ‘‘ఉపఎన్నికల్లో ఓటమి ఎదురుదెబ్బే. నేను విదేశాల్లో ఉండగా సొంతపార్టీ వారే నన్ను కూలదోయడానికి కుట్ర పన్నుతారని మాత్రం నేను అనుకోవడం లేదు. ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు తమ అసంతృప్తిని రాజకీయ నాయకులకు తెలిసేలా ఏదోక రూపంలో వ్యక్తం చేస్తారు. వాటిని అర్థం చేసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వాలు కూలిపోవు’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని