కశ్మీర్లో ‘జీ-20’ సమావేశం యోచనను తిరస్కరిస్తున్నాం : పాక్
‘జీ-20’ సమావేశాన్ని కశ్మీర్లో నిర్వహించాలన్న భారత్ యోచనను తిరస్కరిస్తున్నట్లు పాకిస్థాన్ శనివారం పేర్కొంది. సభ్య దేశాలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘జీ-20’ 2023 సమావేశాలను జమ్మూ-కశ్మీర్లో నిర్వహించనున్నారు.
ఇస్లామాబాద్: ‘జీ-20’ సమావేశాన్ని కశ్మీర్లో నిర్వహించాలన్న భారత్ యోచనను తిరస్కరిస్తున్నట్లు పాకిస్థాన్ శనివారం పేర్కొంది. సభ్య దేశాలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘జీ-20’ 2023 సమావేశాలను జమ్మూ-కశ్మీర్లో నిర్వహించనున్నారు. ఇందుకుగాను కేంద్రపాలిత ప్రాంత పాలన యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం ఇక్కడ నిర్వహిస్తున్న తొలి ప్రముఖ అంతర్జాతీయ సదస్సు ఇదే. అయితే భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘జీ-20’ సమావేశాన్ని జమ్మూ-కశ్మీర్లో నిర్వహించడానికి భారత్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా వార్తల ద్వారా మా దృష్టికి వచ్చింది. అయితే జమ్మూ-కశ్మీర్.. భారత్-పాక్‌ల మధ్య ‘వివాదాస్పద’ ప్రాంతంగా అంతర్జాతీయంగా అందరికీ తెలుసు. ఈమేరకు ఎలాంటి ‘జీ-20’ సమావేశం నిర్వహించడాన్ని అంతర్జాతీయ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!