మళ్లీ కీవ్‌పై రష్యా దాడులు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునేందుకు యుద్ధం తొలినాళ్లలో ప్రయత్నించి తర్వాత వెనక్కి తగ్గిన రష్యా.. తాజాగా మళ్లీ ఆ నగరంపై దాడులకు దిగింది. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌పైకి పుతిన్‌ సైన్యం 14 క్షిపణులను

Published : 27 Jun 2022 05:16 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకునేందుకు యుద్ధం తొలినాళ్లలో ప్రయత్నించి తర్వాత వెనక్కి తగ్గిన రష్యా.. తాజాగా మళ్లీ ఆ నగరంపై దాడులకు దిగింది. ఆదివారం తెల్లవారుజామున కీవ్‌పైకి పుతిన్‌ సైన్యం 14 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో కనీసం రెండు నివాస భవనాలు నేలమట్టమయ్యాయి. నలుగురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ఏడేళ్ల ఓ బాలికను స్థానికులు రక్షించారు. ఈ నెల 5 తర్వాత కీవ్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి.

బెలారస్‌కు అణ్వస్త్ర క్షిపణులిస్తాం: పుతిన్‌

రాబోయే కొన్ని నెలల్లో బెలారస్‌కు తాము అణ్వాయుధ సామర్థ్యమున్న క్షిపణులను అందించనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. పుతిన్‌తో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో శనివారం రష్యాలో భేటీ అయ్యారు. లిథువేనియా, పోలండ్‌లు ఘర్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తున్నాయని తెలియజేశారు. తమకు సాయం చేయాలని కోరారు. దీంతో స్పందించిన పుతిన్‌.. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఇస్కందర్‌-ఎం వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను కొన్ని నెలల్లో బెలారస్‌కు అందించనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని