జైల్లో పరుపులకు నిప్పుపెట్టిన ఖైదీలు

నైరుతి కొలంబియాలోని ఓ జైల్లో ఖైదీల ఘర్షణల కారణంగా మంటలు చెలరేగి 51 మంది దుర్మరణం పాలయ్యారని, మరికొందరు గాయపడ్డారని జైలు అధికారులు మంగళవారం తెలిపారు. తులువా నగరంలోని జైల్లో ఖైదీలు అల్లర్లకు

Published : 29 Jun 2022 04:24 IST

కొలంబియాలోని తులువా నగరంలో 51 మంది దుర్మరణం

బొగొటా: నైరుతి కొలంబియాలోని ఓ జైల్లో ఖైదీల ఘర్షణల కారణంగా మంటలు చెలరేగి 51 మంది దుర్మరణం పాలయ్యారని, మరికొందరు గాయపడ్డారని జైలు అధికారులు మంగళవారం తెలిపారు. తులువా నగరంలోని జైల్లో ఖైదీలు అల్లర్లకు యత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోందని కొలంబియా జాతీయ ప్రిజన్‌ సిస్టమ్‌ డైరెక్టర్‌ టిటో కెస్టెల్లనాస్‌ తెలిపారు. తదుపరి పరిణామాలను పట్టించుకోకుండా ఖైదీలు పరుపులకు నిప్పు పెట్టారని, దీంతో మంటలు చెలరేగి 49 మరణించారని వెల్లడించారు. అనంతరం న్యాయమంత్రిత్వశాఖ మరణించిన వారి సంఖ్యను 51గా పేర్కొంది. మరోవైపు, మరణించిన వారంతా ఖైదీలేనా? అన్న విషయమై స్పష్టత లేదని టిటో చెప్పారు. 20 మంది ఖైదీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, జైల్లో పనిచేసే గార్డులు ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు న్యాయశాఖ మంత్రి విల్సన్‌ రూయిజ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని