పాక్‌లో పోలియో టీకా బృందంపై కాల్పులు

పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌ గిరిజన జిల్లాలో మంగళవారం పోలియో టీకా బృందంపై గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు బృందానికి రక్షణ కల్పిస్తున్న పోలీసులు కాగా

Published : 29 Jun 2022 05:20 IST

ముగ్గురి మృతి

పెషావర్‌: పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌ గిరిజన జిల్లాలో మంగళవారం పోలియో టీకా బృందంపై గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు బృందానికి రక్షణ కల్పిస్తున్న పోలీసులు కాగా మరొకరు వ్యాక్సిన్‌ సిబ్బంది. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్‌ వేస్తున్న సమయంలో ముష్కరులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లోని వజీరిస్థాన్‌లో ఇటీవల తొమ్మిది పోలియో కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో పోలియో టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కాల్పులకు తమదే బాధ్యత అని ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని