అన్ని వేరియంట్లకూ ఒకే పరీక్ష

కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వేరియంట్లనూ కొద్ది గంటల్లోనే గుర్తించే పరీక్ష విధానాన్ని అమెరికా పరిశోధకులు తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం బాధితుడికి సోకిన వేరియంట్‌ ఏమిటన్నది నిర్దిష్టంగా తేల్చాడానికి శాస్త్రవేత్తలు.. వైరస్‌

Published : 05 Jul 2022 04:16 IST

కొద్ది గంటల్లోనే ఫలితం

హ్యూస్టన్‌: కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని వేరియంట్లనూ కొద్ది గంటల్లోనే గుర్తించే పరీక్ష విధానాన్ని అమెరికా పరిశోధకులు తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం బాధితుడికి సోకిన వేరియంట్‌ ఏమిటన్నది నిర్దిష్టంగా తేల్చాడానికి శాస్త్రవేత్తలు.. వైరస్‌ జన్యుక్రమాన్ని ఆవిష్కరించాల్సి వస్తోంది. ఇందుకు చాలా సమయం, ఆధునిక సాధన సంపత్తి అవసరం. పైగా ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

‘కోవార్‌స్కాన్‌’ అనే కొత్త పరీక్ష విధానంతో ఈ సమస్యకు శాస్త్రవేత్తలు చెక్‌ పెట్టారు. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లోని 8 ‘హాట్‌స్పాట్‌’లకు సంబంధించిన సంకేతాలను గుర్తించగలదు. వేరియంట్లవారీగా వీటిలో వైరుధ్యాలు ఉంటాయి. వాటిని కచ్చితత్వంతో ఈ పరీక్ష గుర్తించగలదని చెప్పారు. ఒక ప్రాంతంలో కొత్త వేరియంట్‌ వస్తోందా అన్నది కూడా ఇది పసిగట్టగలదని వివరించారు. ఒక్కో వైరస్‌ రకం ఒక్కోలా చికిత్సకు స్పందిస్తుందని పేర్కొన్నారు. రోగిలో నిర్దిష్టంగా ఏ వేరియంట్‌ ఉందో గుర్తించి, దానికి సంబంధించిన చికిత్సను అందించే సమర్థ విధానానికి ఈ పరీక్షతో మార్గం సుగమమవుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని