N95 face mask: కరోనా వైరస్‌ను చంపేసే మాస్కు

కొవిడ్‌-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్‌95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్‌

Updated : 05 Jul 2022 08:36 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్‌95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్‌ ఫిల్టర్లలోకి బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీ మైక్రోబియల్‌ పాలీమర్లను విజయవంతంగా జోడించడం ద్వారా రెన్‌సెలీర్‌ పాలీటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ‘‘ఎన్‌95లోని క్రియాశీల ఫిల్టరేషన్‌ పొరలు చాలా సున్నితమైనవి. అవి రసాయన మార్పుల ప్రభావానికి సులువుగా లోనవుతాయి. ఫలితంగా వాటి వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ మాస్కుల్లోని పోగుల కూర్పును మార్చాలి. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది అవుతుంది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాము యాంటీబ్యాక్టీరియల్‌ సామర్థ్యం కలిగిన అమోనియం పాలీమర్లను ఈ పాలీప్రొపలీన్‌ పోగుల ఉపరితలానికి జోడించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అతినీలలోహిత కిరణాల సాయంతో గ్రాఫ్టింగ్‌ చేసినట్లు వివరించారు. ఈ మాస్కు.. తనమీద పడిన వైరస్‌ను చంపేస్తుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని