శ్వాస ద్వారా కొవిడ్‌ టీకా

ముక్కు ద్వారా పీల్చే రూపంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అమెరికన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వైద్య సిబ్బంది సాయం లేకుండా ఎవరికివారు సొంతంగా తీసుకోవచ్చు. ఈ టీకా నిల్వకు శీతల సదుపాయం కూడా

Published : 07 Jul 2022 04:13 IST

అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

హ్యూస్టన్‌: ముక్కు ద్వారా పీల్చే రూపంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అమెరికన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని వైద్య సిబ్బంది సాయం లేకుండా ఎవరికివారు సొంతంగా తీసుకోవచ్చు. ఈ టీకా నిల్వకు శీతల సదుపాయం కూడా అక్కర్లేదు. సాధారణ ఉష్ణోగ్రతలోనే మూడు నెలల వరకు భద్రపరచవచ్చు. మనుషులు కరోనా వైరస్‌ కొమ్ములోని సూక్ష్మభాగాన్ని శ్వాస ద్వారా టీకా రూపంలో తీసుకున్నప్పుడు మన రక్షణ వ్యవస్థ వెంటనే యాంటీబాడీలను తయారు చేస్తుందని పరిశోధకులు వివరించారు. వారి అధ్యయనం నేచర్‌ బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ పత్రికలో ప్రచురితమైంది. ప్రస్తుతం ఇంజక్షన్‌ ద్వారా ఇస్తున్న కొవిడ్‌ టీకా శ్వాసకోశంలోకి అంత సమర్థంగా చేరలేకపోతోంది. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను అతిశీతల వాతావరణంలో భద్రపరచాలి. వాటిని సుశిక్షిత వైద్య సిబ్బంది మాత్రమే ఇవ్వగలరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని