Srilanka Crisis: శ్రీలంక అధ్యక్ష భవనంలో వెయ్యి కళాఖండాలు మాయం

ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యి వరకు కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు.

Updated : 24 Jul 2022 09:51 IST

కొలంబో: ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనాన్ని, ప్రధాని నివాసాన్ని ఇటీవల ఆక్రమించుకున్నప్పుడు దాదాపు వెయ్యి వరకు కళాఖండాలు మాయమయ్యాయని పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులూ ఉన్నట్లు చెప్పారు. దీనిపై దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యక్ష భవనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్య వస్తువుల గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని చెప్పారు. అందువల్ల కచ్చితమైన లెక్కలు తేలడం లేదని పురావస్తుశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి మాదిరి ఆక్రమణలు మరోసారి జరగనిచ్చేది లేదని నూతనాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని