Updated : 26 Jul 2022 05:04 IST

అమెరికాలో ఒకే వ్యక్తికి కరోనా, మంకీపాక్స్‌!

కాలిఫోర్నియా: కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోన్న వేళ.. ప్రపంచ దేశాలను మంకీపాక్స్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ 75 దేశాలకు వ్యాపించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. ఇటువంటి సమయంలో అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ సోకిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి జూన్‌ చివరివారంలో కొవిడ్‌ బారిన పడ్డారు. జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతోన్న ఆయనకు శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగు పొక్కులు రావడం మొదలైంది. దీంతో అనుమానించిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్‌ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  ఈ కేసుకు సంబంధించిన కథనాలు అమెరికా మీడియాలో వెలువడినప్పటికీ అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని