Sri lanka: అప్పులను లంక పునర్‌వ్యవస్థీకరించుకోవాలి

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ముందుగా చైనా సహా ఇతర రుణదాతలతో అప్పులను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సూచించింది. ఆ తర్వాతే ఆ దేశం తమ నుంచి ఆర్థిక ప్యాకేజీని

Updated : 29 Jul 2022 05:09 IST

ఆ తర్వాతే మేం సహాయ ప్యాకేజీ అందిస్తాం: ఐఎంఎఫ్‌

కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ముందుగా చైనా సహా ఇతర రుణదాతలతో అప్పులను పునర్‌వ్యవస్థీకరించుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సూచించింది. ఆ తర్వాతే ఆ దేశం తమ నుంచి ఆర్థిక ప్యాకేజీని ఆశించాలని పేర్కొంది. అప్పుల పునర్‌వ్యవస్థీకరణ పూర్తయ్యాక సాధ్యమైనంత వేగంగా సహాయక ప్యాకేజీని అందించేందుకు కృషిచేస్తామని తెలిపింది. చైనాకు లంక దాదాపు 650 కోట్ల డాలర్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా.

పార్లమెంటును ప్రొరోగ్‌ చేసిన విక్రమసింఘె

శ్రీలంక పార్లమెంటును గురువారం అర్ధరాత్రి నుంచి ప్రొరోగ్‌ చేయాలని దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె నిర్ణయించారు. వచ్చే నెల 3న పార్లమెంటు తిరిగి సమావేశమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని