Al jawahiri: రీపర్.. సూపర్!
అల్‌ఖైదా అధిపతి అల్-జవహరీ అంతమవడంలో ‘ఎంక్యూ-9 రీపర్’ అనే ఆధునిక డ్రోన్ కీలక పాత్ర పోషించింది. అతణ్ని నుజ్జునుజ్జు చేసి చంపేందుకు అమెరికా అధికారులు అత్యంత కచ్చితత్వంతో హెల్ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులను ప్రయోగించింది దాన్నుంచే.
జవహరీని హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన డ్రోన్
అల్‌ఖైదా అధిపతి అల్-జవహరీ అంతమవడంలో ‘ఎంక్యూ-9 రీపర్’ అనే ఆధునిక డ్రోన్ కీలక పాత్ర పోషించింది. అతణ్ని నుజ్జునుజ్జు చేసి చంపేందుకు అమెరికా అధికారులు అత్యంత కచ్చితత్వంతో హెల్ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులను ప్రయోగించింది దాన్నుంచే. ‘ప్రిడేటర్ బి’ డ్రోన్గానూ పిలిచే ఎంక్యూ-9 రీపర్.. హనీవెల్ టీపీసీ331-10 టర్బోప్రొప్ అనే ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. ఇందులో డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ (డీఈఈసీ) వ్యవస్థను జోడించారు. ఫలితంగా ఇంజిన్ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు ఇంధనం వృథా కాకుండానూ అది రక్షణ కల్పిస్తుంది. ఎంక్యూ-9 రీపర్లో పేలోడ్లను మోసుకెళ్లేందుకు ఏడు ఎక్స్టర్నల్ స్టేషన్లు ఉంటాయి. ఈ డ్రోన్ ఏకధాటిగా 27 గంటల పాటు గగన విహారం చేయగలదు. దాడులతో పాటు నిఘా కార్యకలాపాల్లోనూ దోహదపడుతుంది. దాని ఆపరేట్ చేయడమూ సులువే. ‘ప్రిడేటర్ బి’కి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అత్యాధునిక ‘ప్రిడేటర్ బి ఈఆర్’ డ్రోన్లను కూడా ఇప్పటికే తయారుచేశారు. ఏకధాటిగా 34 గంటల పాటు గగన విహారం చేయగల సామర్థ్యం కొత్తవాటికి ఉంది.
ఎంక్యూ-9 రీపర్ విశేషాలు
పొడవు: 36 అడుగులు
ఎత్తు: 12.5 అడుగులు
రెక్కలతో కలిపి మొత్తం వెడల్పు: 66 అడుగులు
బరువు: 2,223 కిలోలు
ఎంత పేలోడ్‌ను మోసుకెళ్లగలదు?: 1,746 కిలోలు
గరిష్ఠ వేగం: 240 నాట్లు
పరిధి: 1,150 మైళ్లు
ఎంత ఎత్తు వరకు వెళ్లగలదు?: 50 వేల అడుగులు
ఏయే ఆయుధాలను మోసుకెళ్లగలదు?: ఏజీఎం-114 హెల్ఫైర్ క్షిపణులు, జీబీయూ-12 పేవ్‌వే-2, జీబీయూ-31 జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యునిషన్స్, జీబీయూ-49 ఎన్హాన్స్డ్ పేవ్‌వే-2, జీబీయూ-54 లేజర్ డైరెక్ట్ అటాక్ మ్యునిషన్స్
ప్రస్తుతం ఏయే దేశాల వద్ద ఈ డ్రోన్లు ఉన్నాయి?
అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్. భారత్ కూడా వీటి కొనుగోలుకు ఆసక్తిగా ఉంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!