కణితులపై పోరాడే కణాల ఉత్పత్తి

కణితులపై పోరాడే సామర్థ్యమున్న రోగ నిరోధక కణాల ఉత్పత్తికి మెరుగైన విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్యాన్సర్‌, రక్తానికి సంబంధించిన వ్యాధుల చికిత్సకు ఇది బాగా

Published : 06 Aug 2022 04:19 IST

వాషింగ్టన్‌: కణితులపై పోరాడే సామర్థ్యమున్న రోగ నిరోధక కణాల ఉత్పత్తికి మెరుగైన విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్యాన్సర్‌, రక్తానికి సంబంధించిన వ్యాధుల చికిత్సకు ఇది బాగా ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

కార్‌-న్యూట్రోఫిల్స్‌, ఎన్‌గ్రాఫ్టబుల్‌ హెచ్‌ఎస్‌సీలను ఈ వ్యాధులకు సమర్థ చికిత్సలుగా పరిగణిస్తారు. న్యూట్రోఫిల్స్‌.. ఒక రకం తెల్లరక్త కణాలు. సులువుగా ఘన కణితుల్లోకి చొచ్చుకెళతాయి. హెచ్‌ఎస్‌సీలు అనేవి నిర్దిష్ట బీజ కణాలు. న్యూట్రోఫిల్స్‌ సహా అన్ని రకాల రక్త కణాలను ఇవి భర్తీ చేయగలవు. అయితే చికిత్సలు, పరిశోధనల కోసం ఈ రెండురకాల కణాలు అప్పటికప్పుడు అందుబాటులో ఉండవు. దాతల నుంచి సేకరించాక రోగుల్లోకి ఎక్కించడానికి పెద్ద మొత్తంలో వీటిని ఉత్పత్తి చేయడం కష్టం. ప్రాథమిక స్థాయి న్యూట్రోఫిల్స్‌.. జన్యుమార్పిళ్లకు అనుకూలంగా ఉండవు.ఈ నేపథ్యంలో మానవ ప్లూరిపొటెంట్‌ మూలకణాల సాయంతో కార్‌-న్యూట్రోఫిల్స్‌ను భారీస్థాయిలో ఉత్పత్తి చేసే విధానాన్ని షియావోపింగ్‌ బావో నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇవి ఎలాంటి కణాలుగానైనా రూపాంతరం చెందగలవు. చిమెరిక్‌ యాంటిజెన్‌ రెసెప్టార్లతో కలపడం వల్ల వాటికి కణతులపై పోరాడే సత్తా లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని