Israel: ఆగని ఇజ్రాయెల్‌ దాడులు

గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు శనివారమూ కొనసాగాయి. గాజాసిటీతో పాటు వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిసింది. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజె) ఉగ్రవాదులు లక్ష్యంగా యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. ఆ సంస్థ

Updated : 07 Aug 2022 05:49 IST

15కు చేరిన మృతుల సంఖ్య
గాజాపై విరుచుకుపడుతున్న యుద్ధ విమానాలు

గాజాసిటీ: గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు శనివారమూ కొనసాగాయి. గాజాసిటీతో పాటు వివిధ నగరాలపై బాంబుల వర్షం కురిసింది. పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజె) ఉగ్రవాదులు లక్ష్యంగా యుద్ధవిమానాలు విరుచుకుపడ్డాయి. ఆ సంస్థ మిలిటెంట్లు నివాసం ఉంటున్న భవనాలను నేలమట్టం చేశాయి. శుక్రవారం నుంచి మొదలైన ఈ దాడుల్లో ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. ఇందులో పీఐజె సీనియర్‌ కమాండర్‌తో పాటు.. ఐదేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలూ ఉన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు తీవ్రంగా స్పందించే హమాస్‌ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రతీకార దాడులకు ఇంకా పాల్పడలేదు. పీఐజె మిలిటెంట్లే.. ఇజ్రాయెల్‌ నగరాలపై రాకెట్లను ప్రయోగిస్తున్నారు. శనివారం.. ఇజ్రాయెల్‌ క్షిపణి ఓ కారును ఢీ కొట్టిన ఘటనలో 75 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. పీఐజె సభ్యుడు నివాసం ఉంటున్న రెండంతస్తుల భవనాన్ని యుద్ధవిమానాలు ధ్వంసం చేశాయి. తాజా దాడులతో గాజాలోని ఏకైక విద్యుత్కేంద్రం కూడా మూతపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని