ఫైర్‌ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!

ఓ ఇంటికి నిప్పంటుకుంది.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ కంపెనీ ఉద్యోగికి గుండెలు పగిలే భయానక పరిస్థితి ఎదురైంది. మంటలు చెలరేగిన ఆ ఇల్లు తనకు సంబంధించిన వారిదే.. అంతేకాదు అగ్నికీలల్లో తన కుటుంబ సభ్యులు

Updated : 07 Aug 2022 08:59 IST

ఓ ఇంట్లో అగ్నికీలలు.. 10 మంది మృతి

పెన్సిల్వేనియా: ఓ ఇంటికి నిప్పంటుకుంది.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ కంపెనీ ఉద్యోగికి గుండెలు పగిలే భయానక పరిస్థితి ఎదురైంది. మంటలు చెలరేగిన ఆ ఇల్లు తనకు సంబంధించిన వారిదే.. అంతేకాదు అగ్నికీలల్లో తన కుటుంబ సభ్యులు సహా 10 మంది చనిపోయారు. మృతుల్లో 5, 6, 7 ఏళ్ల వయసున్న చిన్నారులు, యువకుల నుంచి 79 ఏళ్ల వయసున్న వారు ఉన్నారు. అమెరికా పెన్సెల్వేనియాలోని చిన్న పట్టణమైన నెస్కోపెక్‌లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘోరం చోటుచేసుకుంది. ‘‘ఈ ఘటనలో నా కుమారుడు, కుమార్తె, మామ, బావ, వదిన, ముగ్గురు పిల్లలు, ఇద్దరు బంధువులు చనిపోయారు. రెండంతస్తుల ఆ ఇంటిలో 13 శునకాలు కూడా ఉండేవి.. అవి ఏమయ్యాయో తెలీదు. అగ్ని ప్రమాదం జరిగినట్లు మాకు ఫోన్‌ వచ్చింది. వారు చెప్పిన చిరునామా మా సంబంధీకుల పొరుగు ఇంటిది. తీరా అక్కడకు వెళ్లిచూస్తే మా కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్న ఇల్లే అది’’ అని నెస్కోపెక్‌లోని వాలంటీర్‌ ఫైర్‌ కంపెనీకి చెందిన హరోల్డ్‌ బేకర్‌ ఆవేదనగా తెలిపారు. మృతుల్లో ఒకరైన డేల్‌ బేకర్‌ (19), అతని తల్లిదండ్రులు కూడా అగ్నిమాపక సేవలందించేవారని ఫైర్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు