Gaza : గాజాపై ఆగని దాడులు

గాజాపై భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ముష్కరులు తలదాచుకుంటున్న భవనాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాలోని రఫా శరణార్థి శిబిరంపై శనివారం జరిపిన దాడిలో ఇస్లామిక్‌ జిహాద్‌

Updated : 08 Aug 2022 06:27 IST

ఇస్లామిక్‌ జిహాద్‌ సీనియర్‌ కమాండర్‌ ఖలీద్‌ హతం

గాజా సిటీ: గాజాపై భీకర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ముష్కరులు తలదాచుకుంటున్న భవనాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాలోని రఫా శరణార్థి శిబిరంపై శనివారం జరిపిన దాడిలో ఇస్లామిక్‌ జిహాద్‌ సీనియర్‌ కమాండర్‌ ఖలీద్‌ మన్సూర్‌ హతమయ్యాడు. అదే ఘటనలో మరో ఇద్దరు ముష్కరులు, ఐదుగురు పౌరులు కూడా మృత్యువాతపడ్డారు. దీంతో శుక్రవారం నుంచి మొదలైన ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 31కి పెరిగింది. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడ్డవారి సంఖ్య 250కి పైనే ఉంటుందని పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇరాన్‌ మద్దతుతో కూడిన ముష్కర ముఠా ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ముష్కరులు దాదాపు 580 రాకెట్లను తమవైపు ప్రయోగించారని ఇజ్రాయెల్‌ సైనిక వర్గాలు తెలిపాయి. వాటిలో అనేక రాకెట్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ పసిగట్టి అడ్డుకుందని పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని