Arya Walvekar: మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా ఆర్యా వాల్వేకర్‌

భారతీయ అమెరికన్‌ యువతి ఆర్యా వాల్వేకర్‌ (18) ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’గా ఎంపికయ్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని ఆమె సాధించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 30 రాష్ట్రాల

Updated : 08 Aug 2022 06:28 IST

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్‌ యువతి ఆర్యా వాల్వేకర్‌ (18) ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ’గా ఎంపికయ్యారు. న్యూజెర్సీలో నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అందాల కిరీటాన్ని ఆమె సాధించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 74 మంది హాజరయ్యారు. నటిగా వెండితెరపైనా, టీవీల్లో కనిపించాలనేది తనకు చిన్నప్పటి నుంచి కల అని వాల్వేకర్‌ చెప్పారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడం, వంట చేయడం, చర్చల్లో పాల్గొనడమంటే ఇష్టమని తెలిపారు. ఈ పోటీలో వర్జీనియా విశ్వవిద్యాలయం వైద్య విద్యార్థిని సౌమ్యా శర్మ తొలి రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన్‌ చేకూరి రెండో రన్నరప్‌గా నిలిచారు. మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏగా అక్షి జైన్‌ (వాషింగ్టన్‌), మిస్‌ టీన్‌ ఇండియా యూఎస్‌ఏగా తన్వీ గ్రోవర్‌ (న్యూయార్క్‌) ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని