టీకా పంపిణీతోనే లంపీకి అడ్డుకట్ట

ఉత్తర భారత్‌లో కలకలం సృష్టిస్తున్న లంపీ చర్మవ్యాధి నివారణకు టీకా పంపిణీయే ఏకైక మార్గమని ప్రముఖ భారతీయ అమెరికన్‌ పశువైద్యుడు రవి మురర్కా తెలిపారు. వ్యాధి మరింత ప్రబలకుండా ఉండేందుకుగాను ప్రస్తుతానికి జిల్లాల మధ్య

Published : 08 Aug 2022 05:56 IST

భారతీయ అమెరికన్‌ వైద్యుడు రవి మురర్కా వెల్లడి

వాషింగ్టన్‌: ఉత్తర భారత్‌లో కలకలం సృష్టిస్తున్న లంపీ చర్మవ్యాధి నివారణకు టీకా పంపిణీయే ఏకైక మార్గమని ప్రముఖ భారతీయ అమెరికన్‌ పశువైద్యుడు రవి మురర్కా తెలిపారు. వ్యాధి మరింత ప్రబలకుండా ఉండేందుకుగాను ప్రస్తుతానికి జిల్లాల మధ్య పశువుల రవాణాను నిలిపివేయాలని సూచించారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా లంపీ వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపారు. దాని నివారణకు అవసరమైన టీకాను భారత్‌కు పంపేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం రాజస్థాన్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఆవుల మృతితో రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. పశువులు వ్యాధి కారకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముప్పు ఎక్కువగా ఉన్న పశువుల శరీరంపై సున్నం పూయాలి. దీంతో అది వాటి శరీరంపై ఓ పొరలా ఏర్పడి.. దోమకాటు నుంచి కొంతమేర రక్షణ కల్పిస్తుంది’’ అని వివరించారు. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో పాడి పశువుల్లో లంపీ వ్యాధి పెద్దఎత్తున వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్‌లలో అది ప్రబలంగా ఉంది. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో గత కొన్ని వారాల్లో 3,000 ఆవులు, గేదెలు మృత్యువాత పడగా.. పంజాబ్‌లో 400 వరకు చనిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని