శ్రీలంకకు చైనా నౌకపై వివాదం

అధునాతన ‘పరిశోధక నౌక’ విషయంలో చైనా-శ్రీలంక మధ్య సమస్య తలెత్తింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే ‘యువాన్‌ వాంగ్‌ 5’ అనే ఈ నౌక ఈ నెల 11న హంబన్‌టొటా ఓడరేవుకు వచ్చి 17వ తేదీ వరకు అక్కడ ఉండాలి. తదుపరి

Published : 08 Aug 2022 05:56 IST

అనుమతివ్వడాన్ని వ్యతిరేకించిన భారత్‌

కొలంబో: అధునాతన ‘పరిశోధక నౌక’ విషయంలో చైనా-శ్రీలంక మధ్య సమస్య తలెత్తింది. ముందుగా నిర్ణయించిన ప్రకారమైతే ‘యువాన్‌ వాంగ్‌ 5’ అనే ఈ నౌక ఈ నెల 11న హంబన్‌టొటా ఓడరేవుకు వచ్చి 17వ తేదీ వరకు అక్కడ ఉండాలి. తదుపరి సంప్రదింపులు జరిగే వరకు ఈ నౌక రాకను వాయిదా వేయాలని కోరుతూ కొలంబోలోని చైనా దౌత్య కార్యాలయానికి శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ నెల 5న ఒక నోట్‌ పంపించింది. దీనిపై ఉన్నత స్థాయిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చైనా దౌత్య కార్యాలయం శ్రీలంకను కోరింది. ఈ నిఘా నౌక తమ భద్రతకు ముప్పు అనీ, దీని రాక వెనుక అసలు ఉద్దేశాలేమిటో తెలియాల్సి ఉందని భారతదేశం అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, చైనా రాయబారి చి జెన్‌హాంగ్‌ మధ్య రహస్య భేటీ ఇప్పటికే జరిగిందని కొన్ని పోర్టళ్ల కథనాలు చెబుతున్నాయి. అధ్యక్ష కార్యాలయం ఈ వార్తల్ని తోసిపుచ్చింది. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో మునుపటి ప్రభుత్వం ఈ నౌక రాకకు అనుమతించింది.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts