వలసజీవుల పడవ బోల్తా.. 50 మంది గల్లంతు

గ్రీస్‌ దేశంలోని కార్పథోస్‌ దీవి తూర్పు దిశలో 80 మంది వలసజీవులతో ఇటలీ వైపుగా వెళుతున్న పడవ రాత్రివేళ బోల్తాపడి, దాదాపు 50 మంది గల్లంతయ్యారు. 29 మందిని కాపాడిన గ్రీక్‌ అధికారులు

Published : 11 Aug 2022 05:25 IST

ఏథెన్స్‌: గ్రీస్‌ దేశంలోని కార్పథోస్‌ దీవి తూర్పు దిశలో 80 మంది వలసజీవులతో ఇటలీ వైపుగా వెళుతున్న పడవ రాత్రివేళ బోల్తాపడి, దాదాపు 50 మంది గల్లంతయ్యారు. 29 మందిని కాపాడిన గ్రీక్‌ అధికారులు మిగతావారి ఆచూకీ కోసం బుధవారం గాలింపు చర్యలను కొనసాగించారు. పడవలో ఉన్నవారంతా అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశస్థులు. బలమైన గాలులు వీస్తూ, సముద్రజలాలు అల్లకల్లోలంగా ఉండటం గాలింపు చర్యలకు ఆటంకంగా మారుతోంది. వాయుసేన హెలిక్యాప్టరు, రెండు నౌకాదళ ఓడలు, తీరప్రాంత రక్షకదళ నావ, మరో మూడు వాణిజ్య నౌకలు సహాయచర్యల్లో పాల్గొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని