Gotabaya Rajapaksa: థాయ్‌లాండ్‌కు గొటబాయ!

దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు తాత్కాలికంగా ఆశ్రయమిచ్చేందుకు థాయ్‌లాండ్‌ అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని నెట్టిన గొటబాయ..

Updated : 11 Aug 2022 08:28 IST

సింగపూర్‌/బ్యాంకాక్‌: దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు తాత్కాలికంగా ఆశ్రయమిచ్చేందుకు థాయ్‌లాండ్‌ అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశాన్ని నెట్టిన గొటబాయ.. ఆందోళనకారుల ప్రదర్శనలతో జులై 13న శ్రీలంక విడిచి మాల్దీవులకు.. అక్కడి నుంచి సింగపూర్‌కు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సింగపూర్‌ వీసా గడువు కూడా ముగియనుండడంతో తనకు  ఆశ్రయమివ్వమంటూ ఆయన థాయ్‌లాండ్‌కు విజ్ఞప్తి చేశారు.‘‘మానవతా దృక్పథంతో తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే అవకాశం ఇస్తున్నాం. ఇక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు’’ అని పేర్కొంటూ గొటబాయకు థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయూత్‌.. అనుమతి మంజూరు చేసినట్లు ‘బ్యాంకాక్‌ పోస్టు’ పత్రిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని