Coronavirus: తీవ్రత తక్కువున్నా.. చిన్నారులకూ దీర్ఘకాలిక కొవిడ్‌ ముప్పు!

కరోనా బారిన పడ్డ కొందరు చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే.. ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆసుపత్రిపాలు కానంత మాత్రాన వారిలో లాంగ్‌ కొవిడ్‌ తలెత్తే ముప్పు

Updated : 12 Aug 2022 07:05 IST

హ్యూస్టన్‌: కరోనా బారిన పడ్డ కొందరు చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు తక్కువ తీవ్రతతోనే.. ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆసుపత్రిపాలు కానంత మాత్రాన వారిలో లాంగ్‌ కొవిడ్‌ తలెత్తే ముప్పు ఉండదనుకోవడం సరికాదని సూచించింది. అమెరికాలోని టెక్సాస్‌లో 5-18 ఏళ్ల వయసున్న 1,813 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అందులో 4.8% మంది దీర్ఘకాలిక కొవిడ్‌తో ఇబ్బందిపడినట్లు గుర్తించారు. వాసన-రుచి కోల్పోవడం, అలసట, దగ్గు వంటి లక్షణాలు 1.5% మందిలో 4 నుంచి 12 వారాల పాటు ఉన్నాయని.. మరో 3.3% మందిలో అవి 3 నెలల తర్వాత కూడా కొనసాగాయని తేల్చారు. ప్రధానంగా ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారులు, టీకా వేయించుకోనివారిలో లాంగ్‌ కొవిడ్‌ ముప్పు అధికంగా ఉందని నిర్ధరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని