ట్రంప్‌ నివాసాల్లో సోదాలపై మాటల దుమారం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసాల్లో ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) సోదాలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పోస్టులపై ఎఫ్‌బీఐ డైరెక్టర్‌

Published : 12 Aug 2022 06:12 IST

ఒమాహా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసాల్లో ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) సోదాలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ పోస్టులపై ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ రే బుధవారం అసహనం వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్‌ అభిమానులు పెడుతున్న పోస్టులు శోచనీయం, ప్రమాదకరం’’ అని వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించడాన్ని తప్పుపట్టారు. ట్రంప్‌నకు చెందిన పామ్‌ బీచ్‌, ఫ్లోరిడా రిసార్ట్‌లలో సోమవారం గంటల తరబడి జరిగిన సోదాలపై స్పందించడానికి క్రిస్టోఫర్‌ నిరాకరించారు. శ్వేతసౌధం నుంచి ట్రంప్‌.. కీలక రికార్డులను తీసుకెళ్లారనే అనుమానంతో ఆయన నివాసాల్లో తనిఖీలు జరిగాయి. ట్రంప్‌నకు చెందిన మార్‌ ఎ లాగో నివాసం నుంచి 15 బాక్స్‌ల శ్వేతసౌధం రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ ఏడాది మొదట్లో జాతీయ రికార్డుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. ఏమైనా దుర్వినియోగం జరిగిందా? అనే కోణంలో అమెరికా న్యాయ విభాగం దర్యాప్తు జరుపుతోంది.

సోదాలు రాజకీయ ప్రేరేపితమే!

ట్రంప్‌ నివాసాల్లో ఎఫ్‌బీఐ సోదాలు రాజకీయ ప్రేరేపితమేనని ఆయన మద్దతుదారులైన పలువురు భారత్‌- అమెరికన్లు వ్యాఖ్యానించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను నిలువరించడానికే ఈ దర్యాప్తు చేస్తున్నారంటూ స్వయంగా ట్రంప్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని