సంక్షిప్త వార్తలు (4)

నేపాల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చైనా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశానికి 11.8 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నేపాల్‌ నుంచి తమ దేశానికి ఎగుమతయ్యే 98% వస్తువులపై

Updated : 12 Aug 2022 06:38 IST

నేపాల్‌కు చైనా 11.8 కోట్ల డాలర్ల సాయం 

బీజింగ్‌: నేపాల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా చైనా తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశానికి 11.8 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నేపాల్‌ నుంచి తమ దేశానికి ఎగుమతయ్యే 98% వస్తువులపై సెప్టెంబరు 1 నుంచి పన్నులు విధించబోమని హామీ ఇచ్చింది.  


బాంబుదాడిలో తాలిబన్‌ మతపెద్ద హక్కానీ మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గాన్‌ రాజధాని కాబుల్‌లో గురువారం జరిగిన బాంబుదాడిలో తాలిబన్‌ మతపెద్ద రహీముల్లా హక్కానీ మృతి చెందారు. పాకిస్థాన్‌లోని దారుల్‌ ఉలూం హక్కానియా నుంచి పట్టభద్రుడైన ఆయన చాలాకాలంగా తాలిబన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. శత్రువుల దాడిలో హక్కానీ మరణించినట్లు తాలిబన్ల ప్రతినిధి ప్రకటించారు. దీనికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు.


9 మంది భారతీయుల్ని కాపాడాం: పాక్‌ నేవీ

కరాచీ: భారత వాణిజ్య నౌక అరేబియన్‌ సముద్రంలో బోల్తాపడగా, నీటిలో మునుగుతున్న తొమ్మిదిమంది సిబ్బందిని తాము కాపాడినట్లు పాకిస్థాన్‌ నేవీ అధికారులు గురువారం వెల్లడించారు. బలూచిస్థాన్‌ ప్రావిన్సులోని గ్వాదర్‌ తీరప్రాంతంలో ఆగస్టు 9న ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ నేవీకి చెందిన నౌక, రెండు హెలిక్యాప్టర్లు చేపట్టిన గాలింపు చర్యల్లో పదో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించామన్నారు.


చైనా నిఘా నౌక శ్రీలంకకు రావట్లేదు

కొలంబో: చైనాకు చెందిన అధునాతన నిఘా నౌక ‘యువాన్‌ వాంగ్‌ 5’.. ముందు అనుకున్నట్లుగా శ్రీలంకలోని హంబన్‌టొటా ఓడరేవుకు రావట్లేదు. దీని రాకతో భద్రతపరమైన సవాళ్లు ఎదురవుతాయని భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఈ నెల 17 వరకు ఈ నౌక శ్రీలంకలో ఉండాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని