లంక అధ్యక్షుడి అధికారాలపై వేటుకు బిల్లు

శ్రీలంక అధ్యక్షుడి అధికారాలను కత్తిరించే 22వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను న్యాయశాఖ మంత్రి విజయేంద్ర రాజపక్స పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానమంత్రినీ, మంత్రివర్గాన్నీ తొలగించడానికి అధ్యక్షుడికి ఉన్న విశేష అధికారాన్ని ఈ

Published : 12 Aug 2022 06:36 IST

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడి అధికారాలను కత్తిరించే 22వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను న్యాయశాఖ మంత్రి విజయేంద్ర రాజపక్స పార్లమెంటుకు సమర్పించారు. ప్రధానమంత్రినీ, మంత్రివర్గాన్నీ తొలగించడానికి అధ్యక్షుడికి ఉన్న విశేష అధికారాన్ని ఈ సవరణ రద్దు చేస్తుంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారాలు కేంద్రీకృతం కాకుండా జాగ్రత్త తీసుకోవడం అన్న మాట. దేశం ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయినప్పటి నుంచీ ఉద్యమపథం చేపట్టిన ప్రజాస్వామ్యవాదుల ప్రధాన డిమాండు కూడా ఇదే. వారు కోరిన మేరకు సవరణ బిల్లులో అవినీతి నిరోధక నిబంధనలనూ పొందుపరిచారు.  

బ్యాంకాక్‌ చేరుకొన్న గొటబాయ

శ్రీలంక నుంచి మొదట మాల్దీవులకు, తరవాత సింగపూర్‌కు పరారైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు సింగపూర్‌ ఇచ్చిన తాత్కాలిక వీసా గడువు గురువారంతో తీరిపోయింది. దీంతో ఆయన సింగపూర్‌ నుంచి థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని