లండన్‌లో దాదాభాయ్‌ నౌరోజీ స్మృతికి నీరాజనం

‘గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్‌ నౌరోజీ దక్షిణ లండన్‌లో ఎనిమిదేళ్లపాటు నివసించిన గృహానికి బుధవారం నీలి ఫలకాన్ని అలంకరించినట్లు ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ ఛారిటీ సంస్థ ప్రకటించింది. భారతదేశ 75వ స్వాతంత్య్ర

Updated : 12 Aug 2022 06:43 IST

లండన్‌: ‘గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన దాదాభాయ్‌ నౌరోజీ దక్షిణ లండన్‌లో ఎనిమిదేళ్లపాటు నివసించిన గృహానికి బుధవారం నీలి ఫలకాన్ని అలంకరించినట్లు ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ ఛారిటీ సంస్థ ప్రకటించింది. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు తెలిపింది. ఈమేరకు దాదాభాయ్‌ నౌరోజీ అప్పట్లో నివసించిన ఇటుక రాతి గృహానికి అలంకరించిన నీలి ఫలకం మీద ఆయన వివరాలను లిఖించారు. లండన్‌లో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భవనాలకు నీలి ఫలకాలను అలంకరించే బ్లూ ప్లేక్‌ పథకాన్ని ఇంగ్లిష్‌ హెరిటేజ్‌ నిర్వహిస్తోంది. లండన్‌లో మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌లు నివసించిన గృహాలనూ ఇదేవిధంగా గౌరవించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని