అవును.. రష్యా విమానాలు ధ్వంసమయ్యాయి

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 యుద్ధ విమానాలు క్రిమియాలోని వైమానిక స్థావరంలో ఇటీవల జరిగిన విధ్వంసంలో రష్యా నష్టపోయిందని వార్తలొచ్చాయి. అయితే మాస్కో మాత్రం ఒక్కటి కూడా నష్టపోలేదని ప్రకటన ఇచ్చింది. తాజా

Published : 12 Aug 2022 06:36 IST

ఉపగ్రహ చిత్రాలతో వెల్లడైన నిజం

మాస్కో: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 యుద్ధ విమానాలు క్రిమియాలోని వైమానిక స్థావరంలో ఇటీవల జరిగిన విధ్వంసంలో రష్యా నష్టపోయిందని వార్తలొచ్చాయి. అయితే మాస్కో మాత్రం ఒక్కటి కూడా నష్టపోలేదని ప్రకటన ఇచ్చింది. తాజా ఉపగ్రహ చిత్రాలు మాత్రం రష్యా వైమానిక దళానికి భారీస్థాయిలో ఎదురు దెబ్బ తగిలిందన్న వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఉక్రెయిన్‌ నుంచి 2014లో రష్యా ఆక్రమించిన క్రిమియాలోని సాకీ వైమానిక స్థావరంలో మంగళవారం భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, 14 మంది గాయపడ్డారని మాస్కో ప్రకటించింది. స్థావరంలోని మందుగుండు డిపోలో మంటలు రేగడమే ప్రమాదానికి కారణమని పేర్కొంది. తర్వాత ఈ పేలుడులో 8 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్‌ ప్రకటన ఇచ్చింది. దీన్ని రష్యా ఖండించింది. ఒక్క విమానానికీ నష్టం కలగలేదని తెలిపింది. దీంతో దాడి జరిగిందా, రష్యా చెబుతున్నట్లు నిజంగానే మందుగుండు డిపో పేలిందా అన్న విషయంలో స్పష్టత రాలేదు. అయితే గురువారం న్యూయార్క్‌ టైమ్స్‌ సహా వివిధ పత్రికలు ప్రచురించిన ఉపగ్రహ చిత్రాలతో రష్యా..  ఆరు నుంచి ఏడు యుద్ధ విమానాలను కోల్పోయిందన్న విషయం స్పష్టమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని