రష్యా ఉగ్రవాద దేశమే

రష్యాను ఉగ్రవాద దేశంగా లాత్వియా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పౌరులపై మాస్కో చేస్తున్న దాడులను ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటు ఓ తీర్మానం ఆమోదించింది.

Published : 12 Aug 2022 06:36 IST

లాత్వియా పార్లమెంటు తీర్మానం

బెర్లిన్‌: రష్యాను ఉగ్రవాద దేశంగా లాత్వియా ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పౌరులపై మాస్కో చేస్తున్న దాడులను ఉగ్రవాద చర్యలుగా అభివర్ణించింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంటు ఓ తీర్మానం ఆమోదించింది. 100 మంది సభ్యుల పార్లమెంటులో 67 మంది రష్యా ఉగ్రవాద దేశంగా పేర్కొంటూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. 16 మంది గైర్హాజరయ్యారు. ఇతర దేశాలు కూడా రష్యాను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని లాత్వియా కోరింది. మరోవైపు ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తామని పశ్చిమదేశాలు గురువారం ప్రకటించాయి. ఇందులో జర్మనీ, నెదర్లాండ్స్‌, అమెరికా ఉన్నాయి. రష్యా నుంచి బొగ్గు దిగుమతులపై ఐరోపా యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కో బొగ్గు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు