కార్చిచ్చుపై పోరుకు ఐరోపా సిబ్బంది

నైరుతి ఫ్రాన్స్‌లోని పైన్‌ అడవుల్లో సహా వివిధ ప్రాంతాల్లో చెలరేగిన భారీ కార్చిచ్చులను అదుపు చేసేందుకు ఐరోపా వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ప్యారిస్‌

Published : 13 Aug 2022 05:29 IST

ప్యారిస్‌: నైరుతి ఫ్రాన్స్‌లోని పైన్‌ అడవుల్లో సహా వివిధ ప్రాంతాల్లో చెలరేగిన భారీ కార్చిచ్చులను అదుపు చేసేందుకు ఐరోపా వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి అగ్నిమాపక సిబ్బంది ప్యారిస్‌ చేరుకుంటున్నారు. పోర్చుగల్‌లో వరుసగా ఏడో రోజైన శుక్రవారమూ పైన్‌ అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. ఫ్రాన్స్‌లోని గుండే రీజియన్‌, పొరుగునే ఉన్న లాండెస్‌లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు 74 చదరపు కిలోమీటర్ల మేర కార్చిచ్చు విస్తరించింది. సుమారు పదివేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కార్చిచ్చును ఆపేందుకు 360 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 100 ప్రత్యేక వాహనాలను జర్మనీ, రొమేనియా, పోలండ్‌, ఆస్ట్రియా దేశాల నుంచి పంపించారు. ఇప్పటికే కార్చిచ్చుతో 1,000 మందికిపైగా ఫ్రాన్స్‌ సిబ్బంది పోరాడుతున్నారు. గ్రీస్‌ రెండు కెనడెయిర్‌ విమానాలను పంపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని