ఎఫ్‌బీఐ కార్యాలయంపై దాడికి సాయుధుడి యత్నం

ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఇటీవల జరిగిన సోదాలను నిరసిస్తూ ఎఫ్‌బీఐ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఓ సాయుధుడు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. మృతుడిని రిక్కీ

Published : 13 Aug 2022 05:29 IST

ట్రంప్‌ ఎస్టేట్‌లో సోదాలకు నిరసనగా.. కాల్పుల్లో హతమార్చిన పోలీసులు

విల్మింగ్టన్‌: ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో ఎస్టేట్‌లో ఇటీవల జరిగిన సోదాలను నిరసిస్తూ ఎఫ్‌బీఐ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఓ సాయుధుడు పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. మృతుడిని రిక్కీ షిఫర్‌గా గుర్తించారు. ఎఫ్‌బీఐ సోదాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అతడు పలు పోస్టులు పెట్టాడు. ఆయుధాలు చేతబూని పోరాడాలని, ఎఫ్‌బీఐ ఏజెంట్లను చంపేయాలని పిలుపునిచ్చాడు. రైఫిల్‌తో సిన్సినాటిలోని ఎఫ్‌బీఐ కార్యాలయంలోకి చొరబడేందుకు గురువారం ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోతూ కాల్పులు జరిపాడు. ఆపై జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని