సవాళ్లను ఎదుర్కోగలం: కేంద్ర మంత్రి

ఎటువంటి సవాళ్లు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కేంద్ర ఓడరేవులు, నౌకలు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్‌ సోణోవాల్‌ స్పష్టం చేశారు. చైనా సైన్యానికి చెందిన హైటెక్‌ పరిశోధన నౌకను తన జలాల్లో ఆపి ఉంచేందుకు శ్రీలంక అనుమతి ఇవ్వడంపై ఆదివారం మీడియా ప్రశ్నలకు మంత్రి స్పందించారు.

Published : 15 Aug 2022 06:08 IST

చైనా నౌకకు శ్రీలంక అనుమతిపై సర్బానంద్‌ సోణోవాల్‌

చెన్నై: ఎటువంటి సవాళ్లు ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని కేంద్ర ఓడరేవులు, నౌకలు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్‌ సోణోవాల్‌ స్పష్టం చేశారు. చైనా సైన్యానికి చెందిన హైటెక్‌ పరిశోధన నౌకను తన జలాల్లో ఆపి ఉంచేందుకు శ్రీలంక అనుమతి ఇవ్వడంపై ఆదివారం మీడియా ప్రశ్నలకు మంత్రి స్పందించారు. ఆగస్టు 16 నుంచి 22 తేదీల మధ్య ఈ నౌక శ్రీలంకలోని హంబన్‌టోటా రేవులో ఆగుతుంది. భారత్‌ వద్దంటున్నా ఈ నౌకకు అనుమతి ఇచ్చిన శ్రీలంక వేరే ఉద్దేశాలేవీ తమకు లేవని వివరణ ఇచ్చింది.

శ్రీలంకకు భారత్‌ నుంచి సముద్ర గస్తీ విమానం

ద్వీపదేశం శ్రీలంక జలాల్లో చైనా నౌక లంగరు వేస్తున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే భారత నౌకాదళ ఉప ప్రధానాధికారి ఘోర్మడే రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం కొలంబోకు బయలుదేరారు. ఈ పర్యటనలో సముద్ర గస్తీ విమానం డార్నియర్‌ను శ్రీలంకకు అందజేస్తారు. సోమవారం కొలంబోలో జరిగే ఓ కార్యక్రమంలో శ్రీలంక నౌకాదళానికి దీన్ని అందజేస్తారు. శ్రీలంకకు తక్షణ భద్రతా అవసరాలు తీర్చడంలో భాగంగా భారత్‌ ఈ విమానాన్ని అందజేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని