పాక్‌ నౌకతో యుద్ధ విన్యాసాలు అబద్ధం: శ్రీలంక

పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌకతో తాము కొలంబో నౌకాశ్రయంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నామంటూ వచ్చిన వార్తలను శ్రీలంక ఖండించింది. వాటిని అసత్య వార్తలుగా పేర్కొంది.  ప్రస్తుతం శ్రీలంక జలాల్లో ఉన్న పాక్‌ నౌక పీఎన్‌ఎస్‌ తైమూర్‌ ఆ దేశానికి వెళ్తున్న సమయంలో సోమవారం లాంఛనంగా

Published : 15 Aug 2022 06:08 IST

కొలంబో: పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌకతో తాము కొలంబో నౌకాశ్రయంలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నామంటూ వచ్చిన వార్తలను శ్రీలంక ఖండించింది. వాటిని అసత్య వార్తలుగా పేర్కొంది.  ప్రస్తుతం శ్రీలంక జలాల్లో ఉన్న పాక్‌ నౌక పీఎన్‌ఎస్‌ తైమూర్‌ ఆ దేశానికి వెళ్తున్న సమయంలో సోమవారం లాంఛనంగా విన్యాసాలు(పాసేజ్‌ ఎక్సర్‌సైజ్‌) నిర్వహించనున్నట్లు తెలిపింది. చైనా తయారు చేసిన ఈ కొత్త నౌక పాక్‌కు వెళ్లే క్రమంలో శుక్రవారం కొలంబో పోర్టులో ఆగింది. అంతకు ముందు ఈనౌక చత్తోగ్రామ్‌ పోర్టులో ఆగడానికి బంగ్లాదేశ్‌ అనుమతి నిరాకరించింది. చైనాకు చెందిన అధునాతన నౌక ఒకటి శ్రీలంకకు వస్తుండటంపై భారత్‌ ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో.. పాక్‌ నౌక కూడా ఆ దేశానికి రావడం చర్చనీయాంశం అయింది. యుద్ధ విన్యాసాల కోసమే ఈ నౌక వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీన్ని శ్రీలంక తాజాగా ఖండించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని