Published : 16 Aug 2022 05:48 IST

శ్రీలంకకు బహుమతిగా డోర్నియర్‌ విమానం

కొలంబో: శ్రీలంక సముద్ర భద్రత మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా డోర్నియర్‌ సముద్ర నిఘా విమానాన్ని భారత్‌ సోమవారం బహుమతిగా అందజేసింది.  రెండు రోజుల పర్యటన కోసం శ్రీలంక వచ్చిన భారత నౌకాదళ వైస్‌ చీఫ్‌ అడ్మిరల్‌ ఘోర్మడే.. ఇండియన్‌ హైకమిషనర్‌ గోపాల్‌ బాగ్లేతో కలిసి విమానాన్ని శ్రీలంక అధికారులకు అందజేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో సముద్ర నిఘా విమానాన్ని శ్రీలంకకు బహుమతిగా ఇవ్వాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం జరిగిన విమానం అప్పగింత కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే పాల్గొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని