మిత్ర దేశాలకు ఆయుధాలు అందిస్తాం

తమ మిత్ర దేశాలకు అత్యంత అధునాతనఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. సైనిక సహకారాన్ని విస్తరించుకోనున్నట్లు చెప్పారు.

Published : 16 Aug 2022 06:25 IST

ఉక్రెయిన్‌పై చర్య సబబే: పుతిన్‌

మాస్కో: తమ మిత్ర దేశాలకు అత్యంత అధునాతనఆయుధాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. సైనిక సహకారాన్ని విస్తరించుకోనున్నట్లు చెప్పారు. సోమవారం ‘వార్షిక ఆయుధ ప్రదర్శన’ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. భిన్న ధ్రువ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో రష్యా ఆయుధ ఎగుమతులు కీలకపాత్ర పోషిస్తాయని పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను సమర్థించుకున్నారు. మద్దతుగా నిలిచిన మిత్రపక్షాలను కొనియాడారు. 

రష్యా దాడుల్లో 100 మంది మృతి

ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌పై రష్యా సేనలు జరిపిన దాడుల్లో కనీసం ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ రాకెట్‌ దాడులు కొనసాగాయి. ఖర్కివ్‌లోని వైమానిక స్థావరంపై తాము చేసిన దాడిలో 100 మంది చనిపోగా, 50 మంది వరకు గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఐగోర్‌ కొనషెంకోవ్‌ చెప్పారు. వీరంతా పోలండ్‌, జర్మనీలకు చెందినవారని తెలిపారు. ‘మార్షల్‌ లా’ను మరో 90 రోజుల కాలానికి పొడిగిస్తూ ఉక్రెయిన్‌ పార్లమెంటు నిర్ణయించింది. కీవ్‌, లివివ్‌, తర్నిపిల్‌ ప్రాంతాల భద్రతను పర్యవేక్షిస్తున్న అధిపతులపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వేటువేశారు. రష్యాతో కుమ్మక్కు అవుతున్నారనే ఆరోపణపై గత నెలలోనూ కొందరికి ఆయన ఉద్వాసన పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని