అణ్వస్త్ర పరీక్షలు వద్దు

ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి చెబితే పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సోమవారం ప్రతిపాదించారు. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను విడనాడితే ఆసియాతోపాటు యావత్‌ ప్రపంచంలో

Published : 16 Aug 2022 06:25 IST

వాటిని విడనాడితే ఉత్తర కొరియా అభివృద్ధికి కృషి

కిమ్‌కు దక్షిణ కొరియా అధ్యక్షుడి ప్రతిపాదన

సియోల్‌: ఉత్తర కొరియా అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి చెబితే పెద్దఎత్తున ఆర్థిక సహకారం అందిస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ సోమవారం ప్రతిపాదించారు. ఉత్తర కొరియా అణ్వస్త్రాలను విడనాడితే ఆసియాతోపాటు యావత్‌ ప్రపంచంలో శాంతి స్థాపన సుగమం అవుతుందన్నారు. కొరియా ద్వీపకల్పంలో జపాన్‌ వలస పాలన అంతమైన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ యూన్‌ సోమవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఉత్తర కొరియా అణు, క్షిపణి పరీక్షలను విడనాడితే తీవ్ర కరవును అధిగమించడానికి ఆహారం అందిస్తామని, విద్యుత్తు, రేవులు, విమానాశ్రయ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తామని, వ్యాపార సంబంధాలను వృద్ధి చేసుకుంటామని యూన్‌ ప్రతిపాదించారు. వ్యవసాయ, వైద్య రంగాలను ఆధునికీకరిస్తామని, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తోడ్పడతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని