Coronavirus: క్షయ టీకా దెబ్బకు కొవిడ్ పరార్.. అమెరికా పరిశోధకుల అధ్యయనం
క్షయవ్యాధి నివారణకు వాడే బీసీజీ టీకాను పలు మోతాదుల్లో టైప్-1 మధుమేహులకు ఇస్తే.. వారికి కొవిడ్-19 నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుల సుదీర్ఘ అధ్యయనం నిర్ధరించింది. ప్రస్తుతం వాడుతున్న
బోస్టన్: క్షయవ్యాధి నివారణకు వాడే బీసీజీ టీకాను పలు మోతాదుల్లో టైప్-1 మధుమేహులకు ఇస్తే.. వారికి కొవిడ్-19 నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుల సుదీర్ఘ అధ్యయనం నిర్ధరించింది. ప్రస్తుతం వాడుతున్న యాంటీజెన్ ఆధారిత టీకాలు కొవిడ్-19 నివారణకే పరిమితం. బీసీజీ టీకా కొవిడ్‌తోపాటు ఇతర వైరస్లు, అంటువ్యాధులను కూడా అడ్డుకొంటుందని పరిశోధకులు తెలిపారు. 2020 నుంచి కొవిడ్ కేసులు విజృంభించగా, అంతకుముందు నుంచే 144 మంది టైప్-1 మధుమేహులపై బీసీజీ ఎలా పనిచేస్తుందన్న అంశంపైన పరిశోధన జరిగింది. పరిశోధనలో పాల్గొన్న 144 మందిలో 96 మందికి బీసీజీ టీకా ఇచ్చి, 48 మందికి ఉత్తుత్తి మందు (ప్లాసిబో) ఇచ్చారు. ప్లాసిబో తీసుకున్నవారిలో 12.5 శాతం మందికి కొవిడ్-19 సోకగా, బీసీజీ టీకా తీసుకున్నవారిలో ఒక శాతానికి మాత్రమే కొవిడ్ వైరస్ సోకింది. అంటే.. బీసీజీ టీకా కొవిడ్‌పై 92 శాతం సామర్థ్యం చూపిందని తేల్చారు. టైప్-1 మధుమేహులకు కొవిడ్ సోకితే చాలా ప్రమాదం. వీరిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తమ పరిశోధనలో పాల్గొన్న టైప్-1 మధుమేహులకు కొవిడ్ విరుచుకుపడటానికి ముందు మూడు బీసీజీ డోసులు ఇచ్చామనీ, అవి వారికి రక్షణకవచంగా నిలిచాయని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి పరిశోధకుడు డెనిస్ ఫౌస్ట్‌మన్ వివరించారు. బీసీజీ టీకా ఆలస్యంగా పనిచేసినా, దీర్ఘకాలం రక్షణ ఇస్తుందని చెప్పారు. దీనివల్ల ప్రతికూల ఫలితాలేమీ లేవు. ఇది కొవిడ్ కొత్త రూపాల మీద కూడా పనిచేయవచ్చు. చాలా చౌకగా దొరికే బీసీజీ టీకాను ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మంది బాలలకు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్‌బై
-
ఆప్‌కు మరో షాక్.. సత్యేందర్ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్‌కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు