కలిసి పనిచేద్దాం

స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లేఖలు రాశారు. అమెరికాలో భారత రాయబారి

Published : 17 Aug 2022 06:11 IST

ముర్ము, మోదీలకు బైడెన్‌ లేఖ

వాషింగ్టన్‌, దిల్లీ: స్వాతంత్య్ర అమృతోత్సవాలను పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ లేఖలు రాశారు. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ సంధూకు విదేశీ వ్యవహారాల ప్రతినిధి మెక్‌కియాన్‌ వీటిని స్వయంగా అందజేశారు. కొవిడ్‌పై పోరు, వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడం, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్ని మెరుగుపరిచే విషయంలో భారత్‌తో కలిసి పనిచేయాలని బైడెన్‌ భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మరింత స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, సుసంపన్నమైన ప్రపంచం కోసం ఉమ్మడిగా పని చేయాలని మునుపటి భేటీలో బైడెన్‌-మోదీ చర్చించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్యాలను, స్వేచ్ఛను పరిరక్షించుకోవడం రెండు దేశాల్లో అన్ని తరాల వారికి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు 1947 నుంచి అమెరికా కట్టుబడి ఉందన్నారు. ఇరు దేశాల స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందంటూ భారత మొట్టమొదటి ప్రధాని నెహ్రూకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని